Homeరివ్యూస్ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్ : 3 /5
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : శిరీష్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి
స్క్రీన్ ప్లే : అనిల్‌ రావిపూడి
ఎడిటర్ : తమ్మిరాజు
నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, మురళీశర్మ, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు.

‘ఎఫ్ 2కి.. మూడింతలు వినోదంతో వస్తున్నాం అంటూ ఎఫ్ 3 ను బాగా ప్రమోట్ చేశారు. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు నవ్వించగలిగిందో రివ్యూ చూద్దాం.

కథ :
ఎఫ్ 2కి సీక్వెల్ అంటూ వచ్చిన ఈ చిత్రం కథ పరంగా దానితో ఎలాంటి సంబంధం లేదు. ఇక ఈ చిత్ర కథలోకి వెళ్తే… వెంకీ (వెంకటేష్)- వరుణ్ (వరుణ్ తేజ్) డబ్బు కోసం పడే పాట్లు ఎలా ఉన్నాయి అనే కోణంలో ఈ సినిమా కథ మొదలైంది. వీరిద్దరూ ఎప్పుడూ డబ్బు సంపాదన కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ.. ఏది వర్కౌట్ కాదు.

మరో పక్క హారిక (తమన్నా) ఫ్యామిలీ వీరిద్దర్నీ మోసం చేస్తూ ఉంటుంది. మొత్తానికి అందరూ కష్టాల్లో పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించకుంటారు. అంతలో ప్రముఖ వ్యాపారవేత్త (మురళీ శర్మ) తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతున్నాడని వీరికి తెలుస్తోంది. దాంతో ఎవరికీ వారు కొడుకుగా నమ్మించి కోట్లాది ఆస్తికి వారసులు కావాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో వీళ్ళు ఏమి చేశారు ? వీళ్లకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి ? అనేది మిగిలిన కథ.

F3 Telugu Movie Review
F3 Telugu Movie Review

విశ్లేషణ :
మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రంలో వెంకీ – వరుణ్ కెమిస్ట్రీ, వారి యాక్టింగ్, అలాగే అనిల్ దర్శకత్వ పనితనం, కొన్ని లవ్ ఎపిసోడ్లు అండ్ కామెడీ ట్రాక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకీ తన పాత్ర‌కు ప్రాణం పోసాడు. తన మార్క్ నటనతో పాటు లుక్స్ పరంగా కూడా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు.

వరుణ్ తేజ్ కూడా హాస్య సన్నివేశాల్లో చాలా సెటిల్డ్ గా చేసి ఆకట్టుకున్నాడు. తన కామిక్ టైమింగ్‌ తో కొన్ని సీన్స్ లో హైలెట్ గా నిలిచాడు. ఇక కథానాయకిగా నటించిన తమన్నా, తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని హాస్య సన్నివేశాల్లో ఆమె మెప్పించింది.

- Advertisement -
F3 Review and rating
F3 Review and rating

ప్రత్యేకంగా మెహ్రిన్ ట్రాక్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. కీలక రోల్ లో కనిపించిన మురళీశర్మ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. . వెన్నెల కిషోర్, రఘుబాబుతోపాటు కమెడియన్స్ గా నటించిన ఇతర నటులు కూడా చాల బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ – వరుణ్ తేజ్ నటన,
తమన్నా గ్లామర్,
కామెడీ సీన్స్
మెయిన్ థీమ,
అనిల్ రావిపూడి డైరెక్షన్
మెహ్రిన్ – వరుణ్ మధ్య కెమిస్ట్రీ,

మైనస్ పాయింట్స్ :
స్లో సాగే కథనం,
పాత సినిమాల షేడ్స్,
బలహీనంగా సాగే పాత్రలు,
లాజిక్ లెస్ డ్రామా

F3 Review in Telugu
F3 Review in Telugu

తీర్పు :
ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి సింపుల్ కథను తీసుకున్నా మంచి కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే ఎంటర్ టైన్ చేశారు. మొత్తానికి పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY