అల్లు అర్జున్ పుష్ప లో తన పాత్ర గురించి: Fahadh Faasil

0
447
Fahadh Faasil about Pushpa film

Fahadh Faasil Pushpa: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు ఫహద్‌. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు ఫహద్‌. తన పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారాయన. పుష్ప మూవీలో తన పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుందని వయస్సుతో సంబంధం లేని పాత్ర చేశానని చెప్పుకొచ్చారు. 30 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తిగా పుష్ప సినిమాలో కనిపించడం కొరకు చాలా కష్టపడ్డానని ఫహద్ ఫాజిల్ అన్నారు. పుష్ప పాత్ర కొరకు ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ ఫాలో అయ్యానని ఫహద్ తెలిపారు. ఫహద్ తన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ గతంలో తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’ తనని ఎంతగానో మెప్పించిందన్నారు. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ రూపొందిస్తోన్న ‘విక్రమ్‌’ సినిమాలోనూ నటిస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. బన్నీకి జోడీగా ఈ మూవీలో రష్మిక మందన్నా నటిస్తుండగా సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.