Fahadh Faasil look poster from Pushpa 2 The Rule: ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ‘పుష్ప’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. మలయాళ నటుడే అయినా తెలుగులోనూ ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు. ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పుష్ప 2 ద రూల్’ నుంచి కొత్త పోస్టర్ తో తనకు బర్త్ డే విషెస్ ను అందజేశారు దర్శక నిర్మాతలు.
Fahadh Faasil look from Pushpa 2 The Rule: కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.అలాగే ఈ చిత్రంలో ఫహద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ ఫహద్ ఫాజిల్ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.
‘పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్.. ‘పుష్ప-2 దిరూల్’పై అంచనాలు పెంచాయి. అలాగే ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే కాన్సెప్ట్ వీడియో కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది.

‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అని అర్థం’ అని బన్నీ డైలాగ్ ఆ వీడియోకు హైలైట్‌గా నిలిచింది.
ప్యాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.