Pushpa 2 The Rule Shooting Update: స్టైలిష్ స్టార్ ని ఐకాన్ స్టార్ గా చేయడంతో పాటు అల్లు అర్జున్ (Allu Arjun) కి పాన్ ఇండియన్ రేంజ్ గుర్తింపు తెచ్చిన మూవీ పుష్ప. అలాగే డైరెక్టర్ సుకుమార్ ని కూడా ఈ మూవీ ఓ ప్లాన్ ఇండియన్ డైరెక్టర్ గా మార్చింది అని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా.. సౌత్ లోనే కాక నార్త్ లో కూడా పెద్ద సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్ మరియు కులమత కట్టుబాట్ల మధ్య చిత్రించిన ఊర మాస్ పిక్చర్ ఇది.
Pushpa 2 The Rule Shooting Update: ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ గా పుష్పరాజు యొక్క మ్యానరిజమ్స్ కు టాలీవుడ్ ఏ కాదు.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ చిత్రం ఎటువంటి మాస్ హిస్టీరియాని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప 1 లోని క్యాచీ డైలాగ్స్ కొన్ని నెట్లో బాగా వైరల్ అయ్యాయి.
అలాగే ఈ చిత్రం నుంచి వచ్చిన మంచి మాస్ సాంగ్ ఊ అంటావా మామ…ఇన్స్టా, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఈ పాట బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీల సైతం ఈ పాటకు స్టెప్పులు కలిపి వీడియోలు అప్లోడ్ చేశారు. అయితే ఈ చిత్రంలో లాస్ట్ లో మొదలైన హీరో విలన్ ట్రాక్ నెక్స్ట్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ హై టెన్షన్ డ్రామా కోసం ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.’భన్వర్ సింగ్ షెకావత్’ సీక్వెల్లో తన పగ ఎలా తీర్చుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి వెరీ పుష్ప అని విడుదలైన వీడియో మరియు గంగ జాతరలో వేషం వేసుకున్న అల్లు అర్జున్ స్టైల్ ఫస్ట్ పిక్ చిత్రంపై ఆసక్తిని పెంచాయి.

ఇప్పుడు ఈ చిత్రం నుంచి పుష్ప రాజ్ పైన షెకావత్ ఓ రేంజ్ లో రివెంజ్ తీసుకుంటాడు అనే న్యూస్ లీక్ అవడం మరో కిక్ నిస్తోంది. రీసెంట్ గా చిత్రం షూటింగ్లో భాగంగా ఫాహద్ ఫజిల్ షెకావత్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇంపార్టెంట్ షూటింగ్ పూర్తి చేశారట. దీని సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ తమ అఫీషియల్ ట్విట్టర్ లో “భన్వర్ సింగ్ షెకావత్ తో ఒక కీ షెడ్యూల్ ని కంప్లీట్ అయ్యింది. ఈసారి పగతో షెకావత్ తిరిగొస్తాడు” అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ కి సంబంధించిన ఫాహద్ పిక్ కూడా వైరల్ అవుతుంది.