‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ విడుదల వాయిదా

0
197
family-man2-is-postponed
family-man2-is-postponed

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్2’వెబ్ సిరీస్ విడుదలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 12న అమెజాన్‌ ఫ్రైమ్‌లో ఈ సిరీస్‌ రిలీజ్‌ కావాలి.. అయితే దీన్ని వేసవి వాయిదా వేస్తున్నట్లు దర్శకులు ప్రకటించారు. ఈ వాయిదాపై దర్శకులు మాట్లాడుతూ.. “ది ఫ్యామిలీ మ్యాన్2 కోసం ఫ్యాన్స్‌ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సూపర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని రిలీజ్ ను వేసవికి వాయిదా వేస్తున్నాం” అని స్పష్టం చేశారు. కాగా..  ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వివాదాల్లో ఉండటమే దీనికి కారణం అని అర్థం అవుతుంది.

 

 

అటు ఇప్పటికే అమెజాన్‌లో విడుదలైన మిర్జాపూర్, తాండవ్ వెబ్ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. అంతేకాకుండా వీటి కారణంగా అమెజాన్ నోటీసులను కూడా అందుకున్న విషయం తెలిసిందే. అందుకనే కాస్త ఆలస్యం అయినా ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్‌ను ఇప్పుడప్పుడే విడుదల చేయాలని అనుకోవడంలేదు. ’ది ఫ్యామిలీ మ్యాన్2‘ విషయంలో అమెజాన్ ఎటువంటి రిస్క్ లేకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థం అవుతోంది.