నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

0
252
fans-built-temple-for-nidhi-agarwal
fans-built-temple-for-nidhi-agarwal

సినీ తారలకు అభిమానులు ఉండటం సహజం. కానీ తమ అభిమాన తారలకు గుడి కట్టడం చాలా అరుదు. అయితే తమిళ తంబీలు మాత్రం ఎటువంటి కారణం లేకుండా గుడి కట్టేస్తున్నారు. సవ్యశాచి సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన అందాల తార నిధి అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.

 

 

ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా నిధి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించనుంది. పవన్-క్రిష్ కాంబోలో రానున్న సినిమాలో నిధి హీరోయిన్‌గా చేసే లక్కీ చాన్స్ కొట్టేశారు. అయితే ఇటీవల తమిళ తంబీలు నిధికీ వెలకట్టలేని బహుమానం అందించారు. తమ అభిమాన నటికి విగ్రహం పెట్టించి పాలాభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొందరు నెటిజన్లు నిధి ఏం చేసిందని గుడి కట్టారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.