ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు ఫాన్స్ అలాగే మూవీ లవర్స్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా మహేష్ అభిమానులు కేక్ కట్ చేస్తూ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పుట్టినరోజుని. అంతేకాకుండా తన రాబోయే సినిమాల నుండి కూడా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
అయితే ఇక్కడ ఏ టాలీవుడ్ హీరో చేయని పని మహేష్ బాబు ఫ్యాన్స్ జీవితకాలం గుర్తుండి పోయేలా వాళ్ల అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ బాబుకి తన 48వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయే గిఫ్ట్ ని ఇవ్వటం జరిగింది. మహేష్ పేరు మీద ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేయించారు.
ఏకంగా అంతరిక్షంలో ఒక నక్షత్రాన్ని తన పేరు మీద గిఫ్ట్ గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లో మారింది. ఫాన్స్ లో కల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ వేరయా అనిపించుకున్నారు ఈ భార్య గిఫ్ట్ తో. స్టార్ రెజిస్త్రేషన్ సంస్థ ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా నుండి మేకర్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు కారం సినిమా నుండి మేకర్స్ బర్త్డే పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మాస్ లుక్ కలిగివున్న రెండు పోస్టర్లను ఈరోజు విడుదల చేశారు. విడుదలైన మాస్ లుక్ పోస్టర్తో మహేష్ బాబు అభిమానులు సందడి చేస్తున్నారు సోషల్ మీడియాలో. దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.