ఇటీవలే ‘జాతిరత్నాలు’ సినిమాతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. ఆమె నవ్వుతో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఫరియా హైట్ పై ప్రభాస్ కామెంట్స్ చేయడంతో ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చేసుకుంది. శివరాత్రి సందర్భంగా విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమాకు మంచి టాక్ లభించింది.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించాడు. చిత్రంలో నటించిన నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి ఆడియన్స్‌తో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే పడింది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా బంపర్ ఆఫర్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న రవితేజ.. తన తర్వాతి సినిమాను త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్గా తీసుకుంటే బెటర్ అని దర్శకనిర్మాతలతో రవితేజ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఫరియా ఇంకా ఏ సినిమాను ఒప్పుకోలేదని తెలుస్తోంది.
Click Here For Faria Abdullah Latest Photos