Film producer k rajan lodges complaint against actor vishal
Film producer k rajan lodges complaint against actor vishal

విశాల్.. ఎంతో మంది పెద్ద పెద్ద తమిళ సినీ ప్రముఖులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. ఆయనను ఎన్నికల దగ్గర నుండీ ఎన్నో విషయాల్లో ఇరికించాలని పలువురు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ విశాల్ ఇప్పటి వరకూ ఎటువంటి తప్పు చేసినట్లూ నిరూపణ కాలేదు. నడిగర్ సంఘాన్ని ప్రక్షాళన చేయాలని భావించి ఎన్నో విషయాలను బయటకు తీసుకొని వచ్చాడు విశాల్. శరత్ కుమార్ కు ఎదురొడ్డి మరీ పోరాటాన్ని సాగించిన విశాల్ ను ఏదో ఒక విషయంలో దెబ్బతీయాలని ప్రత్యర్థి వర్గం భావిస్తోంది. అందుకే ఎన్నో ఆరోపణలు.. ఇప్పుడు మరోసారి విశాల్ పై సంచలన ఆరోపణలు చేశారు.

నిర్మాత కే.రాజన్‌ విశాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడిన రాజన్ విశాల్ కొన్ని కోట్ల అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపించారు. నిర్మాతల సంఘాన్ని విశాల్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. 13 కోట్ల రూపాయల అవకతవకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో పలువురు నిర్మాతల సంఘానికి నిధులనుఅందించగా.. దాన్ని విశాల్‌ విచ్చలవిడిగా ఖర్చు చేశారని అన్నారు. విశాల్ సంఘానికి చెందిన లెక్కలను ప్రతిదీ చెప్పి తీరాలని, లేని పక్షంలో విశాల్‌పై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని కే.రాజన్‌ పేర్కొన్నారు. ఈయన ఆరోపణలపై విశాల్ ఎటువంటి సమాధానం చెబుతారో చూడాలి.

విశాల్ కెరీర్ పరంగా ఒక హిట్.. ఒక ప్లాప్ అన్నట్లు తయారవుతోంది. అంతకు ముందు తీసిన టెంపర్ రీమేక్ ‘అయోగ్య’ భారీ హిట్ అందుకోగా.. ఇటీవల విడుదలైన ‘యాక్షన్’ సినిమా ప్లాప్ ను మూటగట్టుకుంది. కంటెంట్ పరంగా సినిమా బాగున్నా.. అనవసర సన్నివేశాలు సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. ఇక తుప్పారివాలన్-2(డిటెక్టివ్-2) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.