‘ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్’ పోస్టర్‌ విడుదల

106
'ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్' పోస్టర్‌ విడుదల
'ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్' పోస్టర్‌ విడుదల

గత కొంతకాలంగా అందరిలో చర్చలో ఉన్న సినిమా ఎఫ్‌సీయూకే(ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్). ఈ సినిమా అసలు ఎలా ఉంటుంది. ఎటువంటి కథాంశంతో సినిమా తెరకెక్కనుందన్న అనుమానాలు సినీ ప్రియుల్లో వచ్చాయి. దానికి తోడుగా సినిమా మేకర్స్ కూడా సినిమా ప్రచారంలో భాగంగా రోజుకో పాత్రను రివీల్ చేస్తున్నారు. మొదటగా ఫాదర్ పాత్రలో జగపతిబాబు పోస్టర్‌ను విడుదల చేశారు. రెండోసారి చిట్టి పాత్రలో బేబీ సహశ్రీత పోస్టర్‌కు రిలీజ్ చేశారు.

 

 

నిన్న ఉమా పాత్ర అమ్ము అభిరామ్ పోస్టర్‌ వచ్చి సినిమాపై అంచనాలను పెంచాయి. అందులోని చివరి పాత్ర కార్తిక్ పోస్టర్‌ను నిన్న విడుదల చేశారు కదా మళ్లీ ఇప్పుడు ఇంకో పోస్టర్ ఏంటనీ ఆలోచిస్తుననారా. నేడు తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అన్ని పాత్రలు కలిసి ఉన్నాయి. చేతిలో క్యాబేజీ పట్టుకొని జగపతి బాబు, అమ్ము అభిరామ్, కార్తీక్, సహశ్రీత అందరివి కొత్త ఫోటోలతో తాజా పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనున్న విషయం తెలిసిందే. మరి ఈ సంక్రాంతికి ఎన్ని ఫ్యామిలీలను ఈ సినిమా అలరిస్తుందో చూడాలి.