FIR Filed Against Vaani Kapoor Over Wearing A Blouse With Sri Ram name
FIR Filed Against Vaani Kapoor Over Wearing A Blouse With Sri Ram name

బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ తను వేసుకున్న దుస్తుల కారణంగా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. అందులో లైట్ పింక్ కలర్ తో ఉన్న దుస్తుల్ని ధరించింది. మరీ.. ముఖ్యంగా ఆమె ధరించిన మోడ్రన్ బ్లౌజ్ ఇప్పుడు వివాదానికి కారణంగా మారింది.

ఆందాల్ని ఆరబోస్తూ షూట్ చేసిన బ్లౌజ్ మీద హిందువులు పవిత్రంగా పూజించే శ్రీరాముడి పేరు రాసుండటంతో ఇదో వివాదంగా మారింది. వాణీ కపూర్ వేసుకున్న బ్లౌజ్ తమ మత సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ముంబైలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అతడి ఫిర్యాదు మేరకు ఎమ్‌ఎన్‌ జోసీ మార్గ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి పేరు రాసుంది. బ్లౌజ్ మొత్తం దేవుడి పేరుతోనే ప్రింట్ అయి ఉంది.హిందూ సంప్రదాయాన్ని మంటగలిపేలా ఉందని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఆమె ఫోటోపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. తాను ధరించిన బ్లౌజ్ వ్యవహారం రచ్చగా మారటంతో సోషల్ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలను డిలీట్ చేశారు.