Rang De: కోవిడ్ -19 సంక్షోభం మధ్య యువ హీరో నితిన్ తన రాబోయే చిత్రం రంగ్ దే షూటింగ్‌ను స్టార్ట్ చేసిన విష్యం తెలిసిందే.. నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను దుబాయిలో చిత్రీకరిస్తున్నారు. నితిన్ మరియు కీర్తి సురేష్ షూటింగ్ నుండి ఫోటో లీక్ చేయబడింది..
సోషల్ మీడియాలో ఈ ఫొటో ప్రత్యక్ష్యం అయ్యింది. దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సందర్బంగా అక్కడ తెలుగు వారు ఫొటో తీసి షేర్ చేశారు. దాంతో ఈ ఫొటో కాస్త వైరల్ అయ్యింది. లీకైన పిక్చర్లో వస్తున్న నితిన్ మరియు కీర్తి సురేష్ ఇద్దరూ దుబాయ్ వీధిలో తిరుగుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో సాయి కుమార్, నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మజీ, వెన్నెలా కిషోర్ మరియు వినీత్ సహాయక పాత్రల్లో ఉన్నారు. నితిన్ ఈ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. రంగ్ దేతో పాటు, హిందీ చిత్రం అంధధున్ రీమేక్ అయిన తెలుగు చిత్రంలో నితిన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.