‘పుష్పక విమానం’.. ఇండియన్ సినిమా హిస్టరీలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు క్రియేట్ చేసిన వండర్.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటనతో జీవం పోసిన మూకీ సినిమా.. ఇప్పుడు ఇదే టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా రాబోతోంది.. టాలీవుడ్ రౌడీ స్టార్, యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాకి ‘పుష్పక విమానం’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
డార్క్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీతా సైనీ కథానాయికలుగా, దామెదర దర్శకుడిగా పరిచంయ అవుతున్నారు.. కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ తన తమ్ముడి సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి, మూవీ టీంకి విషెస్ తెలిపాడు. ‘దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆనంద్, ఇటీవల ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లాక్డౌన్ వల్ల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది..
సునీల్, సీనియర్ నరేష్, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతమందిస్తున్నారు.