శ్రీ విష్ణుతో.. ‘కేజీయఫ్‌’ గరుడ ఫైటకి సిద్ధం..!

0
35
Garuda Ram is a villain in the Sri Vishnu Bhala Thandanana movie

కన్నడ పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌’లో గరుడ పాత్ర పోషించి, విలన్‌గా అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకట్టుకున్నాడు రామచంద్రరాజు అలియాస్‌ రామ్‌. ఈ క్రమంలో తెలుగులో పలు సినిమాలకు సంతకం చేశాడు. యువ నటుడు శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘భళా తందనాన’లో ఆనంద్‌ బాలిగా తన విలనిజాన్ని ప్రదర్శించనున్నాడు. బుధవారం రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆనంద్‌ బాలి పాత్రకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ చిత్రంలో శ్రీ విష్ణుని ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త అవ‌తారంలో ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు చైత‌న్య‌. ప్ర‌ముఖ నిర్మాణ‌సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు స‌ర‌స‌న కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ గ‌రుడ రామ్ మెయిన్‌విల‌న్‌గా న‌టిస్తున్నారు.

ఐదు పాట‌లు ఉన్న ఈ చిత్రానికి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌, శ్రీ‌కాంత్ విస్సా రైట‌ర్‌, మార్తాండ్ కె వెంక‌టేష్ ఎడిట‌ర్‌, గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్.

first look of Garuda Ram’s Sree Vishnu’s Bhala Thandanana out now