First look of Puri Jagannadh’s, Akash Puri Romantic out soon
First look of Puri Jagannadh’s, Akash Puri Romantic out soon

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. నూతన దర్శకుడు అనిల్ పడూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పూరీనే స్టోరీ , స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ అయింది. సినిమా పేరుకి తగ్గట్లుగానే పోస్టర్ కూడా కాస్త రొమాంటిక్ గానే ఉంది. బీచ్ వడ్డున మెడ పై హీరోయిన్ని కూర్చో పెట్టుకుని అటు తిరిగి ఉన్న హీరో.. అతన్నే గట్టిగా పట్టుకుని కూర్చున్న హీరోయిన్ ను చూపిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిర బేడీ ని తీసుకున్నారు.మాఫియా బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే డాషింగ్ డైరెక్టర్ తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశాడు.