జనవరి 29 న ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్

0
338
first-look-of-son-of-india-movie-is-ready-to-launch-on-jan-29th
first-look-of-son-of-india-movie-is-ready-to-launch-on-jan-29th

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు తాజాగా చేస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అనౌన్స్ చేశారు. సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ గణతంత్ర దినోత్సవానికి విడుదల చేయాల్సి ఉంది. కాని కొన్న అనివార్య కారణాల వల్ల దీనిని 29న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రకటనను ట్విటర్ ద్వారా ప్రకటించారు.

 

 

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఇదేవిధంగా ట్విటర్ వేదికా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనిని 24ఫ్రేమ్స్ ఫాక్టరీ, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో మోహన్ బాబును ఎన్నడూ చూడని విధంగా చూపించనున్నామని మేకర్స్ అన్నారు. ఇప్పటికే పవర్‌ఫుల్ పాత్రల్లో మోహన్ బాబు కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. అల్లరి మొగుడు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్ సినిమాలు వాటిలోనివే. సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కూడా మోహన్ బాబును ఎంతో ఫవర్ ఫుల్ చూపించనున్నట్లు అర్థం అవుతోంది. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎంత వరకు ఆకర్షిస్తుందో చూడాలి.