(First look poster of Naga Chaitanya, Sai Pallavi’s Love Story Revealed )అక్కినేని హీరో నాగ చైతన్య ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి తొలిసారిగా నాగ చైతన్యకు జంటగా నటిస్తుండగా దర్శకుడు ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి ‘లవ్ స్టోరీ’ అనే పేరును ఖరారు చేశారు శేఖర్ కమ్ముల. హీరో, హీరోయిన్ కలసి ఉన్న ఒక ఇంటెన్సిటీ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమలో కనిపించే భావోద్వేగాలను పోస్టర్లో పలికించాడు శేఖర్ కమ్ముల.
ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నాగ చైతన్య పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. ఓ ఫిట్ నెస్ సెంటర్ లో పనిచేస్తూ సాదా సీదా బట్టలలో చాలా ఆర్డినరీ బాయ్ గా ఉన్న నాగ చైతన్య లుక్ ఆసక్తిరేపింది. గతంలో నాగ చైతన్య ఎన్నడూ చేయని ఓభిన్నమైన రోల్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్‌ని పోస్టర్‌తో కలిగించారు శేఖర్ కమ్ముల. పోస్టర్‌తో కథను పరిచయం చేయడంలో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబోకి తగ్గ లుక్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో టాక్ వచ్చేసింది.
రెహమాన్ స్కూల్ నుంచి పరిచయం అవుతున్న ‘పవన్’ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం కానుంది. సమ్మర్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్‌ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది.సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్‌కి స్సెషల్ ఎట్రాక్షన్‌గా మారనుంది.