మొదటి షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన మహేష్ బాబు

12 ఏళ్ల విరామం తర్వాత మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB28 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే SSMB28 ఈ సినిమాపై ప్రేక్షకులు లోనూ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. SSMB28 shooting ఈ నెల 12న ప్రారంభించిన విషయం తెలిసిందే.

SSMB28 షూటింగ్ కు సంబంధించి మహేష్ బాబు అలాగే పూజా హెగ్డే మొదటగా అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో గత మూడు రోజులుగా షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu SSMB28 షూటింగ్ విషయంలోకి వెళ్తే, మునుపెన్నడూ ఎరుగని రీతిలో త్రివిక్రమ్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అలాగే మొదటి షూటింగ్ షెడ్యూలు ఈ నెల ఆఖరి వరకు జరగాల్సి ఉండగా మధ్యలోనే ఆపివేయడం పై చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

షూటింగ్ ఆగిపోవటం పై కారణాలు చూస్తే మహేష్ బాబు త్రివిక్రమ్ ఇప్పుడు దాకా షూట్ చేసినా యాక్షన్ సీన్స్ విషయంలో లో సంతృప్తిగా లేకపోవడంతో మొదటి షెడ్యూల్ ని అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందంటూ సోషల్ మీడియాలోనూ ఇటు సినీ సర్కిల్ లోను న్యూస్ చక్కెర్లు కొడుతుంది.

అలాగే త్రివిక్రమ్ కూడా మరికొన్ని రోజులు టైమ్ తీసుకుని షూటింగ్ ని మళ్ళీ ప్రారంభించాలని చూస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తుంది అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ SSMB28 షూటింగ్ సంబంధించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles