చావు కబురు చల్లగా ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్

345
Chaavu Kaburu Challaga - FixAyipo Full Video Song Kartikeya, Lavanya Tripathi | Koushik
Chaavu Kaburu Challaga - FixAyipo Full Video Song Kartikeya, Lavanya Tripathi | Koushik

యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ,  శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  బుల్లితెర బ్యూటీ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదల అయిన అనసూయ స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 

 

సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతుంది.