రవితేజ 68 లో గాలి సంపత్ హీరోయిన్

544
Gaali Sampath Heroine to be Acted in Raviteja68
Gaali Sampath Heroine to be Acted in Raviteja68

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో రవితేజ కెరీర్ హిట్ అందుకున్నారు. అదే జోరుతో తాజాగా ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

 

ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అమృతా అయ్యర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రవితేజ 68 గా ప్రచారం అవుతోంది.

 

 

ఈ చిత్రాన్ని దర్వకుడు త్రినాథ రావ్ నక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయమై ఓ వార్త సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. రవితేజ68లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ లవ్‌లీ సింగ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.

 

 

ఈ సినిమాలో కనిపించనున్న ఇద్దరు హీరోయిన్‌లలో ఒకరిగా లవ్‌లీ సింగ్ ఫిక్స్ అయ్యారని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లవ్‌లీ సింగ్ తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన గాలి సంపత్ సినిమాలో నటించారు. ఇప్పుడు మాస్ మహారాజ సినిమాలో ఛాన్స్ అందుకున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.