Ram Charan Game Changer First Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్‌లో వైభవంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 విజయంతో సక్సెస్ జోరు మీద ఉన్న సుకుమార్, రామ్ చరణ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ RC 17 రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా మొదలవడానికి ఇంకా సంవత్సరం సమయం పడుతుందని సమాచారం.
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16 మూవీ చేస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో పూర్తయిన గేమ్ చేంజర్ 2025 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డల్లాస్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుకుమార్ రివ్యూ: (Game Changer Review)
సుకుమార్ మాట్లాడుతూ, “ఇప్పటికే చిరంజీవి గారితో కలిసి ఈ సినిమాను చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ గూస్ బాంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ అందించిన పెర్ఫార్మెన్స్ అవార్డు విన్నింగ్ స్థాయిలో ఉంది. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది,” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మెగాస్టార్ కాన్ఫిడెన్స్:
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇండియన్ 2 వంటి సమస్యల తర్వాత శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ చేసిన జెంటిల్‌మన్ మరియు ఒకే ఒక్కడు లాంటి సొషల్ డ్రామాలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచాయి. ఇదే తరహాలో గేమ్ చేంజర్ కూడా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) ఐఏఎస్ ఆఫీసర్‌గా, పొలిటికల్ లీడర్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. తండ్రి కొడుకుల పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించనుండగా, కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద ఏ రీతిగా సక్సెస్ అవుతుందో చూడాలి!