Game Changer Leaked Song Budget: ప్రముఖ దర్శకుడు శంకర్ అలాగే రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. అయితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ఒకటి లీక్ అవటం జరిగింది. లీక్ అయినా గేమ్ చేజర్ సాంగ్ కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.
అంతేకాకుండా వాట్సాప్ గ్రూపులో కూడా ఈ సాంగ్ హల్చల్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ అలాగే ఫాలోవర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఇటువంటి సినిమాల సంబంధించిన విషయాలు లీక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సీరియస్ అవుతున్నారు.
గేమ్ చేంజర్ (Game Changer) సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు ఈరోజు సాంగ్ లీక్ (Song Leak) అవటంపై పోలీసు కంప్లైంట్ రిజిస్టర్ చేయటం జరిగింది. లీక్‌కు మూలాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీమ్ పోలీసులను కోరింది. అదనంగా, వాట్సాప్‌తో సహా సోషల్ మీడియాలో ఎవరైనా పాటను షేర్ చేసిన వారితో కఠినంగా వ్యవహరించాలని వారు పోలీసులను కోరడం జరిగింది. అలాగే, తక్కువ నాణ్యత గల కంటెంట్‌ను షేర్ చేయవద్దని అభిమానులకు అభ్యర్థన చేయబడింది.

కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్న గేమ్ చేజర్ సినిమాని దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా మొదటి దగ్గర నుండి ఎటువంటి లీక్ కాకుండా మేకర్స్ చాలానే జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ ఎక్కువ షూటింగ్ భాగం అవుట్డోర్ లో చేయటం వల్ల ఏదో ఒకటి సినిమాకు సంబంధించిన లీక్స్ వస్తానే ఉండేవి.
దేని విషయంలోనూ సీరియస్ కానీ మేకర్స్ ఈ సాంగ్ లీక్ విషయంలో సీరియస్ అవ్వటం జరిగింది. లిక్ అయినా సాంగ్ దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ సెట్స్ వేసి నిర్మించటం జరిగిందంట. సాధారణంగా శంకర్ సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ తో ఉంటాయి. అలాగే ఆ సినిమాలో వచ్చే ప్రతి ఒక్క సాంగ్ గురించి కూడా శంకర్ కేర్ తీసుకోవడం జరుగుతుంది.
అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క సాంగును కూడా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో రాబోతున్న అన్ని సాంగ్స్ సంబంధించి దాదాపుగా 100 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు సమాచారం అయితే అందుతుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న గేమ్ చేంజెస్ సినిమా లో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా గేమ్ చేజర్ నుండి లీక్ అయిన సాంగ్ గురించి కొంత మంది బాగుంది అని కామెంట్ చేయగా మరికొందరు రొట్ట లిరిక్స్ అసలు సెట్ అవ్వలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత ఈ చిత్రం వచ్చే అవకాశముంది.