Game Changer Songs Budget: ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలు ఏర్పడిన పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్”. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరియు దర్శకుడు సుకుమార్ తమ ప్రత్యేకమైన కాంబినేషన్‌తో మెగాఫ్యాన్స్ మరియు సినిమా ప్రేమికుల మధ్య అంచనాలు మరింత పెంచారు. భారీ హైప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం మెగా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, అలాగే ఇప్పటికే విడుదలైన గేమ్ ఛేంజర్ నాలుగు సాంగ్స్ అత్యంత భారీ విజయాన్ని సాధించాయి.
శంకర్ దర్శకత్వంలో సినిమా అంటేనే గ్రాండ్ విజువల్స్ ఉంటాయి.. దానితోపాటు ప్రతి ఒక్క సాంగ్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది.. అదే విధంగా గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా ప్రతి ఒక్క సాంగ్ ని ఎంతో జాగ్రత్తగా తరిగెక్కించారు.. దానికీ తగిన భారీ బడ్జెట్ (Budget) అనేది అందరికీ తెలిసిందే.
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలోని అన్ని సాంగ్స్ కలిపి బడ్జెట్ (Budget) ఏకంగా 92 కోట్ల ఖర్చు చేయడం జరిగిందంట.. నానా హైరానా ఒక్క సాంగ్ కి కెమెరా కోసమని దాదాపు 18 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ ఖర్చుకు తగ్గట్టు గానే ప్రతి ఒక్క సాంగ్ గ్రాండ్ విజువల్స్ కనబడుతున్నాయి
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని, దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. భారీ అంచనాలతో “గేమ్ ఛేంజర్” వచ్చే 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న రామ్ చరణ్ (Ram Charan) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి