Game Changer – NTR30 – Rajamouli sentiment: దర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే టాలీవుడ్ లోనే కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలందరూ క్యూ కడతారు తన సినిమాలో చేయడానికి. రాజమౌళి చేసింది తప్పు సినిమాల అయినప్పటికీ ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గానే నిలిచాయి. కాకపోతే ఇక్కడ రాజమౌళికి ఒక సెంటిమెంటు ఉంది తనతో సినిమాలు తీసిన తర్వాత ఏ హీరో సినిమా అయినా కచ్చితంగా ఫ్లాప్ ఎదురుకోవాల్సిందే.
Game Changer – NTR30 – Rajamouli sentiment: ఇప్పుడు అందరి కళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ రాబోయే సినిమాల మీద ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ RRR మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అలాగే ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఆస్కార్ అవార్డు తీసుకురావడం కూడా జరిగింది. ఇక రాజమౌళి సెంటిమెంట్ ని చూసుకుంటే ప్రభాస్ తో తీసిన బాహుబలి తర్వాత వరుసగా రెండు రెండు సినిమాలు ఫ్లాప్ అవటం జరిగింది. ఇక్కడ ప్రభాస్ ఒక్కడే కాదు రాజమౌళితో తీసిన ప్రతి ఒక్క హీరోకి ఆ సెంటిమెంటు ఫాలో అవుతుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా RC15 (గేమ్ చేంజర్) మూవీని శంకర్ దర్శకత్వంలో తర్కెక్కిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి 24 కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకొని కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమాని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇద్దరి హీరోల ఫ్యాన్స్ రాజమౌళి సెంటిమెంట్ ని ఎవరు బ్రేక్ చేస్తారా చేస్తారా లేదా బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతుందా అనే టెన్షన్ లో ఉన్నారు.
ఇక్కడ విశ్లేషకులు చెబుతుంది ఏంటంటే రామ్ చరణ్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయారని.. ఆచార్య సినిమాలో తను కూడా ఒక బాకమే కనుక అది ఫ్లాప్ అయ్యిందంటూ చెప్పుకో వస్తున్నారు. ఈ విధంగా చూస్తే మరి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలుగుతాడో లేదో చూడాలి..