Latest Posts

గేమ్ ఛేంజర్ టీజర్ పై సోషల్ మీడియా టాక్

- Advertisement -

Game Changer Teaser Talk: మూడేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో మూవీ గా రిలీజ్ అవుతుంది గేమ్ ఛేంజర్.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు టీజర్ విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని నవంబర్ 9న లక్నోలో టీజర్ ని భారీ ఈవెంట్ తో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్, కైరా అద్వానీ అలాగే మూవీకి సంబంధించిన వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అంతేకాకుండా లక్నోలో మొదటి తెలుగు సినిమా ఈవెంట్ జరుపుకున్న రికార్డు కూడా గేమ్ ఛేంజర్ కి దక్కనుంది.

ఇక గేమ్ చేంజర్ టీజర్ (Game Changer Teaser) సోషల్ మీడియా టాక్ విషయానికి వస్తే..  చెన్నై నుండి వచ్చిన అప్డేట్ అంటూ అలాగే టీజర్ భారీ బ్లాక్ బాస్టర్.. ఇండస్ట్రీ హిట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాకుండా దాదాపు రెండు నిమిషాల వ్యవధి కలిగిన గేమ్ చేంజర్ టీజర్ లో ఒకటే ఒక్క డైలాగు ఉంటుందని అది కూడా అన్ ప్రిడిక్టబుల్ అని చెబుతున్నారు..

- Advertisement -

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన తర్వాత మరింత భారీ అంచనాలు పెరిగే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో మేకర్స్ ప్లాన్ చేశారు.. మొదటిసారిగా అమెరికాలో కూడా సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని జరుపబోతున్నారు మేకర్స్. ఇక టీజర్ విడుదలైన తర్వాత వరుసగా సినిమాలోని సాంగ్స్ కూడా విడుదల చేస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి సంక్రాంతి కి రామ్ చరణ్ (Ram Charan) మరో బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ అయితే నడుస్తుంది మరి విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Game Changer Teaser Talk – Ram Charan next Game Changer Public talk – Social Media Talk, Game Changer Movie Latest News, Game Changer 3rd song update.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles