Latest Posts

అంచనాలు పెంచుతున్న గేమ్ ఛేంజర్ తెలుగు స్టేట్స్ బిజినెస్

- Advertisement -

Game Changer Telugu States Business: ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ (Ram Charan) సోలో మూవీ గా వస్తున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని జనవరి 10th సంక్రాంతి కానుకగా మేకర్స్ విడుదల చేస్తున్నారు. సినిమాపై సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గాలలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.. దానితోపాటు గేమ్ ఛేంజర్ బిజినెస్ కూడా భారీగా పెరిగినట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుండి 160 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది అని అలాగే దీవాలి కి రిలీజ్ చేయబోయే గేమ్ చేంజ్ టీజర్ (Game Changer Teaser) తో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆశిస్తున్నారు. అయితే సంక్రాంతికి పోటీ బాగానే ఉండేటట్టు కనపడుతుంది.. ఒకవైపు బాలకృష్ణ అలాగే మరోవైపు నాగచైతన్య, వెంకటేష్ సినిమా లను లైన్లోకి వస్తున్నాయి. ఎంత తక్కువ రిలీజ్ ఉంటే అంత ఎక్కువ రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ వివరాలు చూస్తే ఈ కింద విధంగా ఉన్నాయి.

- Advertisement -

Game Changer Telugu States Business

ఆంధ్రా:70 కోట్లు,
సీడెడ్: 30 కోట్లు,
నైజాం: 60 కోట్ల

వీటితోపాటు గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ కూడా దాదాపు 250 కోట్ల పైనే అమెజాన్ ప్రైమ్ అలాగే జి తెలుగు దక్కించుకున్నట్టు సమాచారం. రామ్ చరణ్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ ని ప్రొడ్యూసర్ దిల్ రాజు సరిగ్గా ప్రమోషన్స్ చేసి సినిమాని విడుదల చేస్తే సౌత్ నార్త్ అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి దీనిని ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles