Latest Posts

‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్: శంకర్ మార్క్ & రామ్ చరణ్ యాక్షన్

- Advertisement -

స్టార్ దర్శకుడు శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ పొలిటికల్ డ్రామా జనవరి 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను (Game Changer Trailer) జనవరి 1న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ ట్రైలర్‌లో చరణ్ పాత్రకు సంబంధించిన మూడో గెటప్‌ను కూడా రివీల్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తయిందని, ఇందులో రెండు పాత్రల లుక్స్, ఎమోషన్స్‌తో పాటు శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్సెస్, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ ట్రైలర్ (Game Changer Trailer) అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాకు రెండు విభిన్నమైన ట్రైలర్లను ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వీటిని అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఒకటైన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) లో కియారా అద్వానీ కథానాయికగా, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles