Latest Posts

గేమ్ ఛేంజర్ తో తొలి భారతీయుడిగా రామ్ చరణ్ న్యూ రికార్డు

- Advertisement -

Game Change USA Pre Release Event: సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా ‘గేమ్ చేంజర్’ మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమా చేయ‌ని అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నుంది. డిసెంబ‌ర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జ‌ర‌గ‌నుంది. క‌ర్టిస్ క‌ల్‌వెల్ సెంట‌ర్‌, 4999 నామ‌న్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముంద‌స్తువేడుకి వేదిక కానుండ‌టం విశేషం. చిత్ర యూనిట్‌తో పాటు ప్ర‌ముఖులంద‌రూ ఈ వేడుక‌కి హాజ‌రుకాబోతున్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఛ‌రిష్మా డ్రీమ్స్ ప్రొడ్యూస‌ర్‌, యు.ఎస్ ఎగ్జిబిట‌ర్ రాజేష్ క‌ల్లెప‌ల్లి మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు యు.ఎస్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌లేదు. తొలిసారి గేమ్ చేంజ‌ర్ సినిమా కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో చేయ‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈవెంట్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా చేయ‌టానికి ఇప్ప‌టి నుంచే ప్లానింగ్ చేస్తున్నాం. ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో రామ్ చ‌ర‌ణ్‌గారు, నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్, శంక‌ర్‌గారు అండ్ టీమ్‌కు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.

Ram Charan's Game Changer USA Pre Release Event location details

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ‘జ‌ర‌గండి జ‌రగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ‘గేమ్ చేంజర్’ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Game Changer USA Pre Release Event Details, Game Changer Pre Release Event Guest, Game Changer Movie latest news, Ram Charan, Kiara Advani, Shankar,

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles