చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా గౌతమ్స్ ఈగల్ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యానర్‌పై సాయి తేజ దర్శకత్వంలో ఎం.గౌతమ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఆదివారం ఉదయం లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనీల్ కురుమాంచలం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బెక్కం వేణు గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎం.గౌతమ్, సి.కళ్యాణ్ చేతుల మీదుగా డైరెక్టర్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు. నిర్మాత రాచాల యుగంధర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
చిత్ర నిర్మాత ఎం.గౌతమ్ మాట్లాడుతూ ‘‘మా గౌతమ్స్ ఈగల్ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యానర్‌లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ సాయితేజ ఓ డిఫరెంట్ పాయింట్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

కొత్తగా పెళ్లైన జంటలో భర్త కొన్ని అనుకోని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని తనెలా హ్యాండిల్ చేశాడనే కథాంశంతో సినిమా రూపొందనుంది. మంచి కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునే అంశాల మేళవింపుంగా సినిమా ఆకట్టుకోనుంది. సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.