Actress Gayatri Bharadwaj family, movies, Gayatri Bharadwaj upcoming movies, Gayatri Bharadwaj about Ravi Teja Tiger Nageswara rao, Gayatri Bharadwaj latest hot images
మోడలింగ్ రంగంలో నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది లేటెస్ట్ హాట్ బ్యూటీ గాయత్రి భరద్వాజ్ (Gayatri Bharadwaj). ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara rao) సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. అక్టోబర్ 20న విడుదలవుతున్న ఈ సినిమా గురించి రీసెంట్గా ప్రెస్ మీట్ లో తన బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా వివరించడం జరిగింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ కి నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ (Gayatri Bharadwaj) కాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయత్రి మాట్లాడుతూ.. నాన్న పైలెట్, అమ్మ సైకాలజిస్ట్ అని చెప్పారు… నేను మొదట మోడలింగ్ రంగంలో ఉన్నాను.. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలిచినట్టు ఆమె చెప్పారు. తర్వాత ఓ ప్రాజెక్ట్ సైన్ చేశాను. కోవిడ్ కారణంగా ఆలస్యమౌతూ వచ్చింది. తర్వాత దిన్దొర పాటు మరో రెండు వెబ్ సిరీస్ లు చేశాను.

ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి మాట్లాడుతూ.. ఒకరోజు వంశీ గారి నుంచి కాల్ వచ్చింది. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చెప్పారు. నా పోర్షన్ కి సంబంధించి దాదాపు మూడుగంటల నేరేషన్ ఇచ్చారు. ప్రతిది వివరంగా చెప్పారు. నా పాత్ర గురించి చెప్పినప్పుడు కనీళ్ళు వచ్చేశాయి. చాలా ఎమోషనల్ గా వుండే పోర్షన్ కూడా వుంది. కథలో చాలా ఎత్తుపల్లాలు వుంటాయి. ఎలా అయినా ఈ సినిమా చేయాలని భావించాను. ఈ పాత్ర కోసం దాదాపు 60 మందిని ఆడిషన్స్ చేశారట. ఈ పాత్రకు నేను యాప్ట్ గా ఉంటానని వంశీ గారు భావించారు. రవితేజ గారి ప్రాజెక్ట్ లో భాగం కావడం చాలా అనందంగా ఉంది అని చెప్పడం జరిగింది..

టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి మాట్లాడుతూ.. ఇందులో నా పాత్ర పేరు మణి. విలేజ్ క్యారెక్టర్ లో టామ్ బాయ్ గా కనిపిస్తా. నా పాత్ర చాలా రా, రస్టిక్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటుంది. 70-80 లో జరిగే కథ ఇది. ఇందులో నా ఎప్పిరియన్స్ గురించి మర్చిపోయాను. పూర్తిగా రెండూ భిన్నమైన పాత్రలు. రియల్ లో నేను టామ్ బాయిష్ గా వుండను. అలాగే కొంచెం రిజర్వడ్ గా వుంటాను. కేవలం పాత్రపైనే ద్రుష్టిపెట్టాను. ఈ విషయంలో దర్శకుడు వంశీ గారిని బలంగా నమ్మాను. రవితేజ గారు సెట్స్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు.

రవితేజ గారు మాస్ మహారాజా. సెట్స్ లో చాలా హిలేరియస్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు. అదే సమయంలో చాలా సపోర్టివ్ గా వుంటారు. రవితేజ గారి కామిక్ టైమింగ్ అద్భుతం. రవితేజ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో నటించడం అదృష్టం గా భావిస్తున్నాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్. ఆయన నన్ను భరద్వాజ్ అని పిలుస్తారు. ఆయన థాట్స్ అన్నీ చాలా యంగ్, పాజిటివ్ గా వుంటాయి.

ఇది ఇలా ఉంటే తనకు తెలుగులో ఇష్టమైన నటుడు ఎవరు అని అడగగా దానికి సమాధానం ఇస్తూ.. నాకు రాంచరణ్ గారు అంటే చాలా ఇష్టము.. ఆయన అన్ని సినిమాలు చూశాను.. అలాగే RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం నాకు చాలా సంతోషం వేసింది అని చెప్పడం జరిగింది.
స్టువర్టుపురం దొంగ నేపథ్యంతో వస్తున్న ఈ టైగర్ నాగేశ్వర సినిమాని ఫ్యాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకుడుగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు మరి ఈ సినిమా విడుదలైన తరువాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.