కరోనా నుంచి కోలుకున్న నటి జెనీలియ!

0
446
genelia deshmukh was tested positive for coronavirus

దేశంలో కరోనా మహమ్మారి విజ్రంబన కొనసాగుతుంది. సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ మహమ్మారి భారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నటి జెనీలియా దేశ్‌ముఖ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు జెనీలియా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు.

‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గడిచిన 21 రోజుల్లో నాలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దేవుడి దయవల్ల ఈరోజు నాకు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ వ్యాధిపై పోరాటం నాకు చాలా సులభంగా అనిపించినప్పటికీ గత 21 రోజుల పాటు ఒంటరిగా గడపడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మరొకరితో గడిపే సమయం ఉండదు. కేవలం డిజిటల్ ప్రపంచంలో మునిగితేలడం వల్ల ఒంటరితనాన్ని పోగొట్టొచ్చు. మళ్లీ తిరిగి నా కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు చేరడం సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచడమే నిజమైన బలం. అందరికీ ఇది అవసరం. త్వరగా పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి, ఫిట్‌గా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాడటానికి ఇదొక్కటే మార్గం’’ అని జెనీలియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.