‘ఆచార్య’లో అదిరిపోయే కామెడీ చేయనున్న గెటప్ శ్రీను

224
getup-srinu-interesting-role-in-chiranjeevi-acharya-movie
getup-srinu-interesting-role-in-chiranjeevi-acharya-movie

జాంబి రెడ్డిలో అదిరిపోయే కామెడీ రోల్ చేసాడు గెటప్ శ్రీను. ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పాడు ఈ కమెడియన్. తాజాగా ఈయన తన స్వగ్రామానికి వచ్చాడు.

 

కళింగగూడెం గ్రామవాసి అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ ఇండస్ట్రీలో గెటప్‌ శ్రీనుగా మారిపోయాడు. పనిమీద స్వగ్రామానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్‌లో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడు గెటప్ శ్రీను.

 

 

రెండేళ్ల కింద వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు గెటప్ శ్రీను. మరోసారి తన సినిమాలో శ్రీనుకు ఆఫర్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ మంచి పాత్ర పోషిస్తున్నానని చెప్పాడు గెటప్ శ్రీను. చిరంజీవితో నటించడం మరిచిపోలేని అనుభూతి అంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్. గతంలోనే అన్నయ్యతో కలిసి నటించిన అనుభవం ఉందని.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నాడు శ్రీను.

 

 

గతంలో చిరంజీవితో ఖైదీ నెం.150తో కలిసి నటించాడు గెటప్ శ్రీను. అలాగే రాజూ యాదవ్‌ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసాడు గెటప్ శ్రీను. మొత్తానికి అటు జబర్దస్త్.. ఇటు సినిమాలు రెండింట్లోనూ గెటప్ శ్రీను హవా బాగానే కనిపిస్తుంది.