Good night movie: గత కొద్ది కాలంగా కాన్సెప్ట్ లేని పెద్ద సినిమాల కంటే కూడా డిఫరెంట్ సబ్జెక్టుతో వచ్చే చిన్న సినిమాలైనా సరే ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే సౌత్ లో వినూత్నమైన సబ్జెక్టులతో వచ్చే సినిమాలకు డిమాండ్ పెరిగింది. మంచి ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చిన్న సినిమాలు కూడా భారీ సక్సెస్ లు సాధించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.
Good night movie: ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ఓ తమిళ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో హైలెట్ అంశం ఏమిటంటే గురక…అవునండి ప్రతి ఇంటిలో కనీసం ఒకరికైనా ఉండే ఈ సమస్య పై ఓ సినిమానే తీశారు. మామూలుగా శారీరకంగా ఎక్కువ అలసిపోయిన వారు లేదా కొంచెం ఎక్కువ బరువు ఉన్నవారు అలాగే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు రాత్రులు గురక ఎక్కువగా పెడతారు.
గుడ్ నైట్ అనే టైటిల్ తో ప్రతి ఇంటిలో ప్రధాన సమస్య అయిన ఈ కొరకని హైలెట్ చేసి తీసిన చిత్రం ప్రస్తుతం కోలీవుడ్లో భారీ హిట్ నమోదు చేసుకుంది. అసలు స్టోరీ లోకి వెళ్తే హీరో అయినా మణికుందన్ కి గురక సమస్య ఉంది. అతను ఉంటుండేది వాళ్ళ అక్క బావ ఇంట్లో.. అయితే ఈ సమస్య వల్ల వాళ్ళిద్దరికీ హీరో ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు అనే నేపథ్యంలో చిత్రం ఆసక్తిగా సాగుతుంది.
తన సమస్య కారణంగా అడపాదడ ఇబ్బందులు పడుతున్న హీరో కు మీరా రఘునాథ్ తో ఏర్పడిన స్నేహం ప్రేమ గా మారి పెళ్లి వరకు వెళ్తుంది. అయితే తన గురక సమస్య చెప్పకుండా పెళ్లి చేసుకున్న తరువాత అసలు విషయం తెలుసుకొని వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తాయి ఎలా దాన్ని పరిష్కరించుకున్నారు అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

చెప్పడానికి చాలా సిల్లీ కాన్సెప్ట్ అయినా కానీ దర్శకుడు దాన్ని చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్ గా చేయడమే కాకుండా చిత్రాన్ని హృదయాలకు హత్తుకునే విధంగా నిర్మించారు. కావలసినంత వినోదాన్ని అందించడంతోపాటు ఆడియన్స్ను సినిమా థియేటర్స్ లో కట్టిపడేసే కాన్సెప్ట్ ని కూడా రూపొందించారు. తమిళనాడు బాగా కనెక్ట్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
Web Title: Good night movie, Good night movie collections , Good night movie collections box office, Good night movie, Good night movie watch online,good night tamil movie release date