Dhanush Sir First Single: వెంకీ అట్లూరి దర్శకత్వం లో ధనుష్ చేస్తున్నా మొదటి తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం సార్. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంగీత దర్శకుడు అందించిన మొదటి సాంగ్ మాస్టారు… మాస్టారు ఈ రోజు విడుదల చేయటం జరిగింది.
Dhanush Sir First Single: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సమస్త వాళ్ళు ధనుష్ రాబోయే సార్ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సార్ సినిమా షూటింగు ముగింపు దశకు వచ్చేటప్పటికీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే చిత్రానికి సంభందించిన మొదటి సాంగ్ మాస్టారు… మాస్టారు ఈరోజు విడుదల అయింది.
మాస్టారు మాస్టారు అంటూ సాగే ఈ గీతానికి తమిళంలో ‘ధనుష్‘, తెలుగు లో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించటం విశేషం. జి వి ప్రకాష్ స్వరాలు, శ్వేతామోహన్ స్వరం పోటీ పడ్డాయనిపిస్తింది.
శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిం చుకున్న ఈ గీతం చిత్ర కథానుసారం కథానాయకుడు ధనుష్ ప్రవర్తన, అతని మంచి మనస్తత్వం, గొప్పతనం గుర్తెరిగిన నాయిక సంయుక్త మీనన్ మనసు ప్రేమైక భావన కు గురైన సందర్భం.

ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ‘సార్‘ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.