‘CHINNA’ Telugu Trailer Out Now, Siddharth Chinna movie trailer released, Siddharth next telugu movie, Siddharth upcoming movie new, Chinna Movie Release Date
బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధార్థ్ మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తున్నారు. మేనమామకి, మేనకోడలికి మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని తెరమీద అత్యద్భుతంగా చూపించిన సినిమా చిన్నా. చిన్నా
లో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన వారందరూ ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ప్రశంసిస్తున్నారు.
చూసిన ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్న సినిమా చిన్నా
. ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది ఈ చిత్రం. సిద్ధార్థ్‌ని ఇదివరకు పలు సినిమాల్లో చూశాం. తెలుగు డైలాగులు తనదైన శైలిలో ఆయన చెప్పే తీరుకు ప్రత్యేకమైన అభిమానులున్నారు.
చిన్నా
లోనూ ఆయన మార్క్ కనిపిస్తుంది. సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమ, అంకితభావం, నమ్మకం వ్యక్తమవుతుంది. చిన్నా
చిత్రానికి ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంలో పన్నయారుం పద్మినియుం
, సేతుపతి
సినిమాలతో డైరక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు అరుణ్‌కుమార్.
సిల్వర్ స్క్రీన్ మీద ఫ్రెష్ సినిమాటిక్ లాంగ్వేజ్‌ని పరిచయం చేస్తుంది చిన్నా
మూవీ. అత్యద్భుతమైన డైలాగులు, అర్థవంతమైన విషయాలతో, సున్నితమైన, కీలకమైన సందేశంతో అందంగా సాగుతుంది చిన్నా
చిత్రం. మనసును హత్తుకునే సినిమా అని ట్రైలర్‌తోనే అర్థమవుతుంది. అక్టోబర్ 6న విడుదల కానుంది చిన్నా
సినిమా. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తి క్రియేట్ అవుతుంది.