Homeసినిమా వార్తలుఆకట్టుకుంటోన్న సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సరికొత్త ప్రోమో.

ఆకట్టుకుంటోన్న సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సరికొత్త ప్రోమో.

Salman Khan and Katrina Kaif Tiger 3 new promo out now, Good response to Tiger 3 new Teaser, Tiger 3 teaser, Tiger 3 release date. Tiger 3 Telugu movie

Salman Khan and Katrina Kaif Tiger 3 new promo out now, Good response to Tiger 3 new Teaser, Tiger 3 teaser, Tiger 3 release date. Tiger 3 Telugu movie

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టైగర్ 3’. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు రీసెంట్‌గా రిలీజైన ‘లేకే ప్రభు కా నామ్’ సాంగ్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఆడియెన్స్‌కి అనుకోని సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది. ‘టైగర్ ఈజ్ బ్యాక్’ పేరుతో 50 సెకన్ల వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇందులో టైగర్ పాత్రలో నటిస్తోన్నసల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీలా శత్రువుల నుంచి దేశాన్ని నాశనం కాకుండా కాపాడటానికి పోరాటం చేస్తున్నారు.

యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగంగా ఏక్ థా టైగర్, టైగర్, వార్, పఠాన్ చిత్రాల తర్వాత టైగర్ 3 రిలీజ్ అవుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు టైగర్ 3 రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి వస్తోన్న 5వ స్పై ఇంటర్ కనెక్ట్ ఫ్రాంచైజీ ఇది.

తాజాగా విడుదలైన టైగర్ ఈజ్ బ్యాక్ ప్రోమోను గమనిస్తే.. అందులో ప్రతినాయకుడిగా నటించిన ఇమ్రాన్ హష్మి భారతదేశాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తాడు. దానికి టైగర్ ఎలా స్పందించాడు.. విలన్‌కి ఎలాంటి షాకిచ్చాడనే విషయాన్ని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రోమోలో చూపించారు.

టైగర్ 3లో టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకుడు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY