రష్మికకు గూగుల్ సర్‌‌ప్రైజ్ అరుదైన గుర్తింపు..!

Rashmika Mandanna is the national crush of India 2020

వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. తెలుగు, కన్నడ పరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందానాకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగూల్ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక గురించిన సమాచారం కనిపిస్తోంది.

గూగుల్ లో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020’ ను సెర్చ్ చేస్తే రష్మిక మందన్నని మాత్రమే చూపిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేషనల్‌ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. రష్మిక మందన్న పేరు కనిపిస్తోంది. ‘రష్మిక మందానా.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది. దీనికి కారణం కూడా ఉందట. ఆమె దుస్తుల ఎంపిక మమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె సరికొత్త లుక్‌ మరింత ఆకట్టుకుంటోంది’ అని కామెంట్ కనిపిస్తోంది. ఇక ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే.. జాతీయ స్థాయిలో అంటే తెలుగు, కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయలేదు.

ఇక పోయిన సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె ఇటీవల నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ప్రస్తుతం బన్నీ-సుక్కు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తోంది. ఈ క్రమంలోనే రష్మికకు గూగుల్‌ సర్‌ప్రైజ్ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *