సీటీమార్‌ రివ్యూ & రేటింగ్

0
8594
Gopichabd Seetimaarr Telugu Movie Review Rating

Gopichabd Seetimaarr Telugu Movie Review Rating:
రేటింగ్ : 2.75/5
న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌
ఛాయాగ్రహణం: ఎస్‌. సౌందర్‌ రాజన్‌;
సంగీతం: మ‌ణిశర్మ;
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి;
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం: సంపత్‌ నంది;
బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్

గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. అలానే ‘గౌతమ్ నంద’ తర్వాత మంచి సక్సెస్ ఫుల్ మూవీ కోసం డైరెక్టర్ సంపత్ నంది ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ మూవీగా తెరకెక్కింది ‘సీటీమార్’. ఈ చిత్రం ఆరంభం నుంచే ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆక‌ర్షిస్తోంది. ప్రచార చిత్రాల త‌ర్వాత మ‌రిన్ని అంచనాలు పెరిగాయి. గోపీచంద్ – త‌మ‌న్నా జోడీ, క‌బ‌డ్డీ నేప‌థ్యం ‘సీటీమార్’`ని మ‌రింత ప్రత్యేకంగా మార్చాయి.

కథ :
బేసికల్ గా కబడ్డీ ఆటగాడైన కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగి. సాయంత్రమైతే చాలు తన వూరిలోని అమ్మాయిలకు కబడ్డీ కోచ్ గా మారిపోతాడు. రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్ లో చదువుకున్న ఈ అమ్మాయిలను నేషనల్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్స్ గా నిలబెట్టి, తద్వారా తమ వూరికి, ఆ స్కూల్ కు గుర్తింపు తీసుకురావాలన్నది అతని కోరిక.

Gopichabd Seetimaarr Telugu Movie Review Rating

ఆ ప్రయ‌త్నంలో ఉన్న కార్తీక్‌కి ఊళ్లోనే ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? దిల్లీలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాని న‌డిపిస్తున్న మాకన్‌సింగ్ (త‌రుణ్ అరోరా)తో కార్తీక్‌కి ఎలా వైరం ఏర్పడింది? త‌న జ‌ట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేత‌గా నిలిచిందా? కార్తీక్ ఆశ‌యం నెర‌వేరిందా? తెలంగాణ క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్ జ్వాలారెడ్డి (త‌మ‌న్నా) కార్తీక్‌కి ఎలా అండ‌గా నిలిచిందనేది మిగ‌తాక‌థ‌.

ప్లస్ పాయింట్
గోపీచంద్ నటన
మణిశర్మ సంగీతం
రోమాంచితమైన యాక్షన్ సీన్స్

మైనెస్ పాయింట్
కథలో కొత్తదనం లేకపోవడం
ప్రిడిక్టబుల్ క్లయిమాక్స్

నటీనటులు:
గోపీచంద్‌కి అల‌వాటైన పాత్రే. కోచ్‌గా ఆయ‌న మ‌రింత హుషారుగా… మేన్లీగా క‌నిపిస్తారు. యాక్షన్ ఘ‌ట్టాల్లో ఎప్పట్లాగే ఆక‌ట్టుకున్నారు. జ్వాలారెడ్డిగా త‌మ‌న్నా తెలంగాణ యాస మాట్లాడుతూ న‌వ్వించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్ గా దిగంగన సూర్యవంశీ చలాకీగా నటించింది. ఇక హీరో ఇంటి సభ్యులుగా ప్రగతి, అన్నపూర్ణ తదితరులు దిగంగన పెళ్ళిని చెడగొట్టే సీన్ లో కామెడీని బాగానే పండించారు.

Gopichabd Seetimaarr Telugu Movie Review Rating

త‌రుణ్ అరోరా భ‌యంక‌ర‌క‌మైన విల‌న్‌గా క‌నిపించినా ఆ పాత్ర క‌థ‌పై పెద్దగా ప్రభావం చూపించ‌దు. అంకిత మహారాణా పై చిత్రీకరించిన ‘పెప్సీ ఆంటీ’ ఐటమ్ సాంగ్ మాస్ ను ఆకట్టుకునేలా ఉంది. అలానే జ్వాలారెడ్డి పాట కలర్ ఫుల్ గా ఉంటే, టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. మణిశర్మ బాణీలు, నేపథ్య సంగీతం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ కన్నుల పండగగా ఉంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

విశ్లేషణ:
సహజంగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కే ఇలాంటి సినిమాలలో హీరోకు ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ స్టోరీస్ కూడా ఇంతే. కానీ ఇందులో మాత్రం హీరోకు అలాంటి చేదు అనుభవాలు ఏమీ ఉండవు. తన తండ్రి కట్టించిన స్కూల్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి, దానిని మనుగడకు ఆ గుర్తింపు ఉపయోగపడుతుందనే ఆశ తప్ప.

Gopichabd Seetimaarr Telugu Movie Review Rating

ప్రథమార్ధమంతా గోదావ‌రి గ‌ట్లు, ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలతోపాటు… ఊళ్లో అమ్మాయిల్ని ఆట‌ల‌వైపు పంపించే విష‌యంలో త‌ల్లిదండ్రుల్లో ఉండే అపోహ‌లు, ప‌ల్లెటూరి రాజ‌కీయాలు కీల‌కం. ద్వితీయార్ధం పూర్తిగా దిల్లీ, క‌బ‌డ్డీ, మాక‌న్ సింగ్ మాఫియా నేప‌థ్యంలో సాగుతుంది. తొలి స‌గ‌భాగంలో కడియం బ్రదర్‌పాత్రలో రావు ర‌మేష్ చేసే రాజ‌కీయం ఆక‌ట్టుకుంటుంది. గోదావ‌రి యాస మాట్లాడుతూ ఆయ‌న చేసే సంద‌డి న‌వ్విస్తుంది.

కబడ్డీ క్రీడను ఎలివేట్ చేయడంతో పాటు మహిళా సాధికారికత గురించి కూడా ఈ సినిమాలో చూపించారు. మరీ ముఖ్యంగా మహిళలు క్రీడాకారులుగా మారితే వారి వ్యక్తిత్వం ఎలా వికసిస్తుందో చూపించే ప్రయత్నం చేశారు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడంతో హీరో పాత్రలోనూ, అతను చేసే పోరాటంలోనూ మరింత ఇంటెన్సిటీ పెరిగింది.

Gopichabd Seetimaarr Telugu Movie Review Rating

కేవలం దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేయడంతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మారింది. సినిమా ద్వారా చెప్పాల్సిన సందేశాన్ని చెబుతూనే ఎంటర్ టైన్ మెంట్ కు, యాక్షన్ కూ సమపాళ్లలో ప్రాధాన్యమిచ్చారు. దాంతో కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించినా, కమర్షియల్ యాంగిల్ లో వాటిని పెద్దంతగా పట్టించుకోనక్కర్లేదు.గోపీచంద్ మార్క్ యాక్షన్‌ ఘ‌ట్టాల‌తోనూ, మ‌రోప‌క్క ఫైన‌ల్ క‌బ‌డ్డీ ఆట‌తోనూ సాగ‌డం మాస్ ప్రేక్షకుల‌తో సీటీ కొట్టేంచేలా చేస్తాయి.

“సీటీమార్” సినిమా పై మీ అభిప్రాయం ఏమిటి ?