ఆకట్టుకుంటోన్న గోపీచంద్ సీటీమార్ ట్రైలర్..!

0
63
Gopichand and Tamannaah Seetimaarr Trailer Released

Seetimaarr Trailer: మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ చిత్రం సీటీమార్. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వస్తోంది. ఈ సినిమాను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

ఈ ట్రైలర్’ను రామ్ పోతినేని తన సోషల్ మీడియా వేదికగా విడుదలచేశారు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు విజువల్స్ ఇందులో బాగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో కనిపించిన ప్రతీ ఒక్క నటుడు గోపీచంద్ నుంచి రావు రమేష్ వరకు ప్రతి ఒక్కరి రోల్ సాలిడ్ గా కనిపిస్తుంది.

తమన్నా (Tamannaah) సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. మాస్ డైలాగులులతో ఆకట్టకుంటోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే ట్రైలర్ కి మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

Gopichand and Tamannaah Seetimaarr Trailer Released

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట జ్వాలా రెడ్డికి మంచి స్పందన వచ్చింది. ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి