గోపీచంద్‌ `సీటీమార్` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..!

0
1042
Gopichand and Tamannaah's Seetimaarr to release in theatres in September

Seetimaarr Gopichand: గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ తెలిపారు.

ఈ సినిమా సెకండ్‌ వేవ్‌ కరోనాకి ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా స్టార్ట్ కావడం, కొంత షూటింగ్‌ పార్ట్ పెండింగ్‌లో ఉండటంతో వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ థియేటర్లు ఓపెన్‌ అయి, జనాలు థియేటర్‌కి వస్తోన్న నేపథ్యంలో ఎట్టకేలకు థియేటర్‌లోనే సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. వచ్చే వారం రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో భూమికా చావ్లా కీలక పాత్ర పోషిస్తుంది.

Gopichand and Tamannaah's Seetimaarr to release in theatres in September 3rd

మహిళా కబడ్డీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా, ఆంధ్రా మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా గోపీచంద్‌ నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మా సినిమాకు మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌గారి మ్యూజిక్, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అండ్ టీమ్ వ‌ర్క్‌ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి.