Balakrishna NBK107 Title: బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. విడుదలైన మొదటి రోజు నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావటంతో అఖండ బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాన్ని సాధించింది. బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ రెండో వారం కూడా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతుంది.
ఇప్పుడు బాలకృష్ణ (Balakrishna) తదుపరి సినిమా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే NBK107. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. NBK107 టైటిల్ గా పెట్టిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో సినిమాను ప్లాన్ చేసుకున్నారు టీమ్.
Day 1 Collections-Roundup 2021 Released Movies
అయితే బాలకృష్ణ (Balakrishna) నటించే NBK107 సినిమాకి టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి ‘వేటపాలెం’ (vetapalem Title) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కూడా మాస్ ప్రేక్షకుల ముందుకు చాలా దగ్గరగా ఉండే టైట్ గా అనిపిస్తుంది.

దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ(Balakrishna) రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమచారం. ఒక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గాను .. మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ బాలకృష్ణ కనిపించనున్నారని చెబుతున్నారు.
ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శ్రుతిహాసన్(Shruthi Hasan) హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ క్రాక్ మూవీతో హిట్ కొట్టిన గోపీచంద్ బాలకృష్ణ తో చేసే సినిమాకు కథ పై చాలా కేర్ తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Follow @chitrambhalareI twitter account for daily updates