gopichand chanakya movie circulating negative talk
gopichand chanakya movie circulating negative talk

మిశ్రమ స్పందనతో మొదలైన చాణక్య మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. దసరా సెలవుల నేపథ్యంలో చాణక్య మూవీ కొంత మేర మెరుగైన వసూళ్లు సాధించినా ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చేతులెత్తేసింది. గోపీచంద్, మెహ్రీన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఏకే ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే .ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో చాణక్య, కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

‘సైరా’ పోటీలో ఉండటంతో ‘చాణక్య’కు కోలుకోలేని దెబ్బ తగిలింది. చిరంజీవి సినిమా బ్లాక్ టాక్ తెచ్చుకున్నాక ఇక ఇతర హీరోల సినిమాలు పోటీలో నిలబడవు. ఈ విషయం ‘చాణక్య’ మొదటి రోజు వసూళ్లను చూస్తే అర్థమైపోతుంది. ఆ తరువాత రోజుల్లో కూడా చాణక్య పెద్దగా కలెక్షన్స్ ను సాధించలేకపోయింది. 6 రోజులకుగాను ఏపీ, తెలంగాణల్లో చాణక్య రూ.3.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా షేర్ రూ.3.9 కోట్లు, గ్రాస్ రూ.6.6 కోట్లు మాత్రమే వసూలైంది. చిత్ర ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం బ్రేక్ ఈవెన్ అమౌంట్ రూ.12 కోట్లని తెలుస్తోంది. మొత్తానికి చాణక్య డిస్ట్రిబ్యూటర్లను పూర్తిగా ముంచేశాడు.