Gopichand Chanakya to clash with Chiranjeevi Sye Raa
Gopichand Chanakya to clash with Chiranjeevi Sye Raa

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే నెల 5న చాణక్య గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు నేడు రిలీజ్ డేట్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది.

ఐతే చాణక్య విడుదల తేదీ అక్టోబర్ 5న ప్రకటించడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సైరా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 250కోట్ల భారీ బడ్జెట్ మూవీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సోలోగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీతో చాణక్య పోటీపడటం ఆసక్తిని రేపుతోంది. అసలు సైరాకి చాణక్యకి పోటీ ఇస్తాడా ? ఏమో కష్టమే. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది.

కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అలాగే విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోందట.. అదేవిధంగా ఈ చిత్రానికి వెట్రి అందిస్తోన్న సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా వచ్చిందని సమాచారం.

అయితే ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోయారు. ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో లాంగ్ షెడ్యూల్స్ షూట్ చెయ్యడం.. పైగా సినిమాలో బడ్జెట్ తో కుడనుకున్న యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో ఇప్పటివరకూ భారీగానే ఖర్చు అయిందట. మరి గోపీచంద్ పైనా భారీ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా ? ఇంతకి పెట్టిన పెద్ద మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. ఒకవేళ వచ్చినా.. సైరా ముందు చాణక్య ఎంతవరకు నిలబడతాడో చూడాలి.