గోపీచంద్ ‘సీటీమార్’ టీజర్

391
gopichand-seetimaar-official-teaserGopichand Tamannaah Sampath Nandi Mani Sharma
gopichand-seetimaar-official-teaserGopichand Tamannaah Sampath Nandi Mani Sharma

సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘సీటీమార్‌’. గోపీచంద్‌, తమన్నా హీరోహీరోయిన్లగా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి న‌టిస్తుంది. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

 

కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట..’ అంటూ గోపీచంద్ డైలాగ్స్ టీజర్ లో చూపించారు. ఈ చిత్రంలో గోపీచంద్‌-తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.