గోపీచంద్ ‘సీటీమార్’ టైటిల్ సాంగ్

376
gopichand-seetimaarr-movie-title-song-released
gopichand-seetimaarr-movie-title-song-released

టాలీవుడ్ ఆరడగుల అందగాళ్లలో గోపీచంద్ ఒకరు. తనదైన నటనతో గోపీచంద్ అందరినీ ఆకట్టుకున్నారు. కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ పాత్రల్లో సైతం అందరినీ అబ్బుర పరిచారు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఎలాగైనా మంచి విజయం అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.

 

అందులో భాగంగా గోపీచంద్ వరుస సినిమాలను ఓకే చేశారు. తాజాగా గోపీచంద్ నటించిన సినిమా సీటీమార్. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ రిలీజ్ అయింది. ‘గెలుపు సురీడు చుట్టూ తిరిగేటి’ అంటూ ప్రారంభం అయిన పాట ‘సీటీమార్.. సీటీమార్’ అంటూ మోటివేట్ చేస్తుంది.

 

 

ఈ పాటకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సారథ్యంలో రూపొందించారు. ఈ పాటలో పాపికొండల నడుమ గోదావరి అందాలను అభివర్ణిస్తూ పాట మొదలవుతోంది. ఈ పాట లిరిక్స్‌తో పాట వీజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. వారు ఊహించిన విధంగానే పాట అద్భుతంగా ఉంది. పాట విడుదలైన తక్కువ సమయంలో విశేష స్పందన అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్ కబడ్డీ మహిళా టీమ్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరో టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు.

 

 

వీరితో పాటుగా భూమికా చావ్లా, రావు రమేష్, తరుణ్ అరోరా, రెహ్మాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మరి సినిమా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరిస్తుందేమో వేచి చూడాలి.