Homeసినిమా వార్తలుGopichand 32: గోపీచంద్, శ్రీను వైట్ల కొత్త సినిమా గ్రాండ్ గా ప్రారంభం.

Gopichand 32: గోపీచంద్, శ్రీను వైట్ల కొత్త సినిమా గ్రాండ్ గా ప్రారంభం.

Gopichand, Sreenu Vaitla New movie Launched Grandly, GopichandNew movie details, Gopichand next cinema latest news, Gopichand32 cast crew, Gopichand32 shooting details

Gopichand, Sreenu Vaitla New movie: మాచో స్టార్’ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 ను ఈరోజు అనౌన్స్ చేశారు. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్‌ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు.

Gopichand, Sreenu Vaitla New movie: సినిమా నిర్మాణం పట్ల ప్యాషన్ ఉన్న వేణు దోనేపూడి ప్రముఖ తారాగణం, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించేందుకు సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్‌ను ప్రారంభించారు. #గోపీచంద్ 32 ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మొదటి సినిమా. సినిమాలోని చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

భారీ బడ్జెట్‌తో లావిష్ గా రూపొందనున్న #Gopichand32 ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు మైత్రి నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు, మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇతర టెక్నికల్ టీమ్‌ను త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY