chanakya Movie, gopichand, Mehreen, Latest Telugu News
chanakya Movie, gopichand, Mehreen, Latest Telugu News

తమిళ స్టార్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే ఇటీవలే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. నెటిజన్లను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ మొత్తానికి చాణక్య పై అంచనాలను పెంచింది. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. అలాగే ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయట. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడట.. సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వబోతుందని తన సన్నిహితుల దగ్గర గోపిచంద్ చెప్తున్నాడట. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.