Bigg Boss 7 Telugu Nominations, Bigg Boss 7 Telugu 6th Week Nominations list, This week Bigg Boss 7 eliminated contestants, Bigg Boss 7 voting, Bigg Boss 7 latest news,
Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ రసవత్తరంగా సాగుతుంది.. ఐదు వారాలు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 6 వారం జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ నుండి ఐదుగురు ఎలిమినేట్ కాగా ఒకళ్ళు సీక్రెట్ రూముల్లో ఉంచడం జరిగింది. సండే రోజు జరిగిన ఎపిసోడ్ లో శుభశ్రీని ఎలిమినేట్ చేయగా గౌతం కృష్ణ ని సీక్రెట్ రూమ్ లో ఉంచడం జరిగింది.
Bigg Boss 7 Telugu 6th Week Nominations: అయితే సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ తర్వాత టేస్టీ తేజ గౌతమ్ ఎలిమినేషన్ కాలేదని అలాగే సీక్రెట్ రూమ్ లో ఉంచినట్టు కనిపెట్టడం జరుగుతుంది. దీనితో బిగ్ బాస్ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా గౌతమ్ ని హౌస్ లోకి రీఎంట్రీ చేయటం నిన్నటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. గౌతమ్ హౌస్ లోకి రావడంతో పాటు తనకి బిగ్ బాస్ కొన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న 8 పోటీదారుల్లో ఒకరిని సేవ్ చేయడం, మరొకరిని నేరుగా నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈవారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి ఎలిమినేషన్ లో ఉన్న వారి పేర్లు చూస్తే ఆట సందీప్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ, పూజా మూర్తి, నయని పావని ఉన్నారు. అయితే గౌతం ఇక్కడ ఎవర్ని నామినేట్ చేయకుండా ఆట సందీప్ ని సేవ్ చేయడం జరిగింది.
అలాగే గౌతమ్ మాట్లాడుతూ నామినేషన్ లో ఉండే పెయిన్ నాకు బాగా తెలుసు అని అందుకే నేను ఎవరిని నామినేట్ నామినేట్ చేయడం లేదని చెప్పడం జరిగింది.. దీనితో బిగ్ బాస్ హౌస్ ఆరో వారం నామినేషన్లలో ఏడుగురు ఉన్నారు.