Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office
Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న’సైరా’ విడుదలకు ఇంకో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభిమానులు స్పెషల్ షోస్ ఎక్కడెక్కడ వేస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు చాలా చోట్ల వేకువజామున 3 గంటల నుండే స్పెషల్ షోలు వేస్తారని తెలుస్తోంది. అంతేగాక అదనపు షోస్ వేయడానికి అనుమతులు కూడా వచ్చేశాయి. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా’ చిత్రానికి అదనపు షోలకు అనుమతి ఇచ్చాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఏపి ప్రభుత్వం రోజుకు 6 షోలకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణలో ఐదు షోలను ప్రసారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దాంతో రేపు ఉదయం 7 గంటలకే హైదరాబాద్ లో అలాగే తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో సైరా షో పడనుంది.

కాగా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకల్లో దాదాపు అన్ని చోట్ల ఈ షోస్ ఉండనున్నాయి. ఈ షోస్ ద్వారా చిత్ర ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండనున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రూ.270 కోట్ల వ్యయంతో రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు.