Vijay Devarakonda VD12 Begins & Cast Crew: యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాని ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టడం జరిగింది. సినిమాకి సంబంధించిన ప్రకటన జనవరి నెలలో విడుదల చేయక.. ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టనున్నారు. పలువురు ప్రముఖుల సమక్షంలో బుధవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ‘VD12’ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.
Vijay Devarakonda VD12 Begins & Cast Crew: VD12 సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో రాబోతున్న VD12 సినిమాని కూడా అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. VD12 సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.